Tuesday, February 24, 2026

ఇందిరా నగర్ లో సాయిపూర్ ఓట్లు..! 

-

spot_img
  •  దాదాపు 300లకు పైగా బోగస్ ఓట్లు నమోదు 
  •  6వ వార్డ్ ఓటర్ జాబితా ను సవరించాలి 
  •  అభ్యంతరం వ్యక్తం చేసిన   బిఆర్ఎస్ నాయకులు వెంకట్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడిందని ఆరో వార్డు బిఆర్ఎస్ నాయకులు  వెంకటేష్   అభ్యంతరం వ్యక్తం చేశారు. 6వ వార్డ్ హమాలీ బస్తీలో సైపూర్ కు చెందిన ఓట్లు నమోదు అయ్యాయని, ఇతర వార్డ్ లా ఓట్లు కూడా అధికంగా 6వ వార్డులో నమోదు అయినట్టు తెలిపారు. సుమారు 400 లకు పైగా బోగస్ ఓట్లు 6వ వార్డులో నమోదు అయ్యాయాని, అధికారులు వెంటనే స్పందించి బోగస్ ఓట్లను తొలగించాలని కోరారు. ఏ వార్డుకు చెందిన ఓటర్లు అదే వార్డులో ఉండేలా పారదర్శకత పాటించాలని, తుది జాబితా ప్రకటన నాటికి ఈ సమస్యలను అన్నింటిని పరిష్కరించాలని కోరారు. తప్పులతో కూడిన ఓటర్ జాబితా వల్ల అభ్యర్థులకు, ఓటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి 6వ వార్డ్ ఓటర్ జాబితాను తక్షణమే సవరించాలని అధికారులను డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories