- 36వ వార్డులో మిన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు
- మహిళలతో కలిసి కేక్ కట్ చేసిన కౌన్సిలర్ రూపా పాటిల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ రూపా పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వార్డులోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ రూపా పాటిల్ మహిళలందరి మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా ఎదుగుతున్నారని కొనియాడారు. మహిళా శక్తి దేశానికి వెన్నెముక వంటిదని, ప్రతి ఇంట్లో మహిళ గౌరవించబడినప్పుడే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు.వార్డులోని మహిళలు చదువుతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని కౌన్సిలర్ పిలుపునిచ్చారు.వార్డు అభివృద్ధి పనుల్లో మహిళలు చూపుతున్న చొరవను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన మహిళా నాయకురాళ్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.




