
- 31వ వార్డు అభివృద్ధియే నా లక్ష్యం
- అమ్జాద్ అలీ పాషా
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు అభివృద్ధి కోసం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు బిఎస్పీ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి అమ్జాద్ అలీ పాషా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నగర మోహన సందర్భంగా 31 వ వార్డు నుండి అభ్యర్థిగా బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా అమ్జాద్ అలీ పాషా మాట్లాడుతూ.. గత కొంతకాలంగా వార్డు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని, రాబోయే ఎన్నికల్లో వార్డు ప్రజల కోరిక మేరకు తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. నాయకుల ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పిస్తే కారు గుర్తుపై పోటీ చేస్తానని, ఒకవేళ అది సాధ్యపడకపోతే వార్డు ప్రజల కోసం, అభివృద్ధిని కాంక్షిస్తూ స్వతంత్ర అభ్యర్థిగానైనా తప్పకుండా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యతని, ఏ పార్టీ నుండి పోటీ చేసినా తన లక్ష్యం మాత్రం వార్డు అభివృద్ధి మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తన నిర్ణయానికి వార్డు ప్రజలు, కార్యకర్తలు పూర్తి మద్దతు తెలపాలని ఆయన కోరారు.



