- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వమే మా బలం
- 14వ వార్డు అభ్యర్థిగా సయ్యద్ బాబర్ భార్య పోటీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని 14వ వార్డు యువ నాయకులు సయ్యద్ బాబర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ పార్క్ సమీపంలో రూ. 18 కోట్ల భారీ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ బాబర్ స్థానిక యువకులతో కలిసి ఎమ్మెల్యేను కలిసి మద్దతు ప్రకటించారు.పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. 18 కోట్ల నిధులతో పట్టణ ముఖచిత్రం మారబోతోందని, ఈ అభివృద్ధి పనులే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. ముఖ్యంగా 14వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డును ప్రభుత్వం జనరల్ మహిళకు కేటాయించినట్లు బాబర్ పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు, తన భార్యను కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వార్డు ప్రజల ఆశీస్సులు, ఎమ్మెల్యే సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






