ఖోఖో క్వీన్‌గా శ్రీలక్ష్మీ…!

- ఖోఖోలో సత్తా చాటిన అక్షర విద్యార్థిని
- 9వ తరగతి నుంచే రాష్ట్ర వేదికపైకి
- అభినందనల్లో మునిగిన అక్షర స్కూల్
- రాష్ట్ర స్థాయిలో మెరువడానికి సిద్ధమవుతున్న శ్రీలక్ష్మి
జనవాహిని ప్రతినిధి తాండూరు : క్రీడా రంగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికవడం అనేది ఒక గొప్ప విజయం. అక్షర స్కూల్, 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలక్ష్మీ తన ప్రతిభతో ఈ ఘనతను సాధించింది. క్రీడా స్ఫూర్తిని, అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శిస్తూ ఆమె మైదానంలో తనదైన ముద్ర వేసింది. ఆమె చురుకుదనం, అసాధారణమైన ఆట తీరు న్యాయ నిర్ణేతలను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ అద్భుత ప్రదర్శన ఫలితంగా, శ్రీలక్ష్మీని ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఆమెకు, పాఠశాలకు గర్వకారణం. శ్రీలక్ష్మీ ఎంపికపై అక్షర స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యాయ బృందం తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ శ్రీలక్ష్మీ కేవలం చదువులోనే కాదు, ఆటల్లోనూ రాణించడం మాకు గర్వకారణం. ఆమె కృషి, పట్టుదలకు ఈ విజయం నిదర్శనం. రాష్ట్ర స్థాయిలోనూ మా విద్యార్థిని సత్తా చాటాలని ఆశిస్తున్నామని అభినందించారు.పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది మొత్తం శ్రీలక్ష్మీని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.



