war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?

పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.

CM YS Jagan Nomination | పులివెందులలో నామినేషన్ సందర్భంగా జగన్ ప్రార్ధనలు

పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు..#YSJagan #Nomination #Pulivendula #APElections2024 #MlaYSJagan

Passengers hit RTC bus| సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చున్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రస్తుతం వీడియో వైరల్…

Akbaruddin Owaisi on Modi | చొర‌బాటుదారులం కాదు మోదీ.. దేశాన్ని అలంక‌రించాం

భారత దేశాన్ని అద్భుతంగా అలంక‌రించామ‌ని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తామేమీ చొర‌బాటు దారులం కాదని bjpకి కౌంటర్ ఇచ్చారు. ఈ దేశానికి తాము చెందుతామ‌ని, త‌మ దేశ‌మ‌ని, ఎప్ప‌టికీ త‌మ‌దే అవుతుంద‌ని తెలిపారు.

Pawan Kalyan nomination in Pitapuram | పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

కాసేపట్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు…

East Godavari Bride Kidnapping | క‌ళ్ల‌లో కారం కొట్టి…పెళ్లి కూతురు కిడ్నాప్ సుఖాంతం

కాసేపట్లో పెళ్లి జరగబోయే కళ్యాణ మండపం బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో కలకలలాడుతోంది. ఇంతలోనే సడన్‌గా కొంతమంది వ్యక్తులు కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ఎంట్రీ ఇచ్చారు. క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడం జరిగిపోయింది. సినిమా స్టయిల్‌లో జరిగిన…

CM Revanth Reddy Adilabad meeting: మోడీ-KCR కేడిలంటూ ఘాటు విమర్శలు

ఆదిలాబాద్ జన జాతర మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు.…

YCP Mla Grandi Srinivas: పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడితే తప్పేముంది?

పెళ్లి చేసుకొని మీ కుటుంబంలోని అమ్మాయికే పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి ఉంటే సీఎం సీఎం అని అరుస్తారా అంటూ జనసేన నాయకులను వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ పెళ్లిళ్లతో జగన్ మాట్లాడితే తప్పేముందన్నారు. కాపు నాయకులు ఒకసారి…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు