iPhone 16 vs iPhone 15 : ఐఫోన్​ 15తో పోల్చితే.. ఐఫోన్​ 16లో వచ్చే అప్​గ్రేడ్స్​ ఇవే!

Iphone 16 price in India : యాపిల్ ఐఫోన్ 16 లాంచ్​కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ లాంచ్​కు ముందే.. లీక్​ అవుతున్న ఫీచర్స్​.. ఐఫోన్​ లవర్స్​ని థ్రిల్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఫోన్​ 15 కొనాలా?…

Gold and silver prices today : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,660కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 66,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు)…

Realme C65 5G launch: రియల్ మి నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్

Realme C65 5G launch: కొన్ని వారాల ఊహాగానాల తర్వాత రియల్ మీ సీ65 5జీ (Realme C65 5G) మనదేశంలో లాంచ్ అయింది. రియల్ మి నార్జో 70, రియల్ మి నార్జో 70ఎక్స్ అనే మరో స్మార్ట్ ఫోన్…

Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ కు మార్గం సుగమం; 1.2 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూకు వాటాదారుల ఆమోదం

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి.. ఐపీఓకు ముందు స్విగ్గీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. 1 బిలియన్ డాలర్లను సమీకరించే యోచనలో ఉన్న స్విగ్గీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.750 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, స్విగ్గీ ఇంకా సెబీ…

ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో ఖాతా ఉందా? బీ అలర్ట్.. వెంటనే ‘ఐమొబైల్’ యాప్ లో ఇవి చెక్ చేసుకోండి..

ICICI Bank iMobile glitch: ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఐ మొబైల్’ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వేల సంఖ్యలో కస్టమర్లు ప్రమాదంలో పడ్డారు. వారి ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ ల వివరాలు వేరే వినియోగదారుల…

New changes in WhatsApp: యూజర్లకు నచ్చని వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్ డేట్; డైరెక్ట్ అటాక్..

New changes in WhatsApp: వాట్సాప్ మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు ఒక కారణం భారత్ సహా వివిధ దేశాల్లోని కోర్టుల్లో జరుగుతున్న ప్రైవసీ ఇష్యూస్ కేసు కాగా, మరొకటి, వాట్సాప్ లో తరచూ వస్తున్న మార్పులు. సాధారణంగా వాట్సాప్ అప్…

WhatsApp encryption case : ‘ఇండియా నుంచి వెళ్లిపోతాము’- కోర్టు ఎదుట వాట్సాప్​ ఘాటు వ్యాఖ్యలు!

WhatsApp encryption case : మెసేజ్​లు, కాల్స్​కు సంబంధించిన ఎన్క్రిప్షన్​ విషయంలో.. దిల్లీ హైకోర్టు ఎదుట బలమైన వ్యాఖ్యలు చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​. ఎన్క్రిప్షన్​ని తొలగించాలని ఆదేశాలిస్తే.. తాము ఇండియా నుంచి వెళ్లిపోతామని పేర్కొంది. ‘ప్రపంచంలో ఇలా ఎక్కడా…

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 150 స్టాక్​తో భారీ లాభాలు పక్కా!

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 486 పాయింట్లు పెరిగి 74,339 వద్ద స్థిరపడింది. 168 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 22,570 వద్ద ముగిసింది. ఇక…

Zerodha CEO : ‘ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే..’ జెరోధా నితిన్​ కామత్​ టిప్స్​..

Nithi Kamat trading tips : స్ప్రెడ్స్ వంటి పూర్తి హెడ్జ్డ్ ఆప్షన్స్ వ్యూహాలను ఎలా ఉపయోగించాలో సెన్సిబుల్ చేసిన పోస్ట్​ను షేర్ చేస్తూ.. ” స్టాక్​ మార్కెట్ ఏమి చేసినా, బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బేర్​ పుట్ స్ప్రెడ్…

Gold and silver prices today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన బంగారం ధర!

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,240కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు)…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు