15.7 C
New York
Sunday, May 19, 2024

Buy now

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ స్ట్రీమింగ్‍పై ఓ విషయాన్ని కన్ఫార్మ్ చేసిన ఓటీటీ.. ‘ప్రేమలు’లా కాకుండా..

Manjummel Boys OTT: మలయాళ సినీ ఇండస్ట్రీలో ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ సంచలనాలు సృష్టించింది. గత రికార్డులు బద్దలయ్యేలా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించిన తొలి మలయాళం మూవీగా చరిత్ర సృష్టించటంతో పాటు మరిన్ని రికార్డులు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 22న విడుదలైన ఈ చిత్రం ఆరంభం నుంచి భారీ వసూళ్లను దక్కించుకుంది. తమిళంలోనూ దుమ్మురేపిన ఈ మూవీ.. ఏప్రిల్ 6న తెలుగులోనూ థియేటర్లలో రిలీజై ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇంత భారీ బ్లాక్‍బస్టర్ అయిన మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.

ముంజుమ్మల్ బాయ్స్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ కైవసం చేసుకుంది. థియేటర్లలో లాంగ్ రన్ ఉండటంతో ఈ మూవీ స్ట్రీమింగ్‍ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, త్వరలో అంటూ ఇటీవలే హాట్‍స్టార్ ఓ అప్‍డేట్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ విషయంలో మరో విషయాన్ని కన్ఫార్మ్ చేసింది.

ఐదు భాషల్లో..

మంజుమ్మల్ బాయ్స్ మూవీని ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు డిస్నీ+ హాట్‍స్టార్ తాజాగా వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుందని ఖరారు చేసింది. ఈ విషయంపై తాజాగా మరో పోస్టర్ తీసుకొచ్చింది. అయితే, తేదీ వెల్లడించకుండా త్వరలో అంటూ ఊరిస్తోంది.

అయితే, మంజుమ్మల్ బాయ్స్ సినిమా మే 3వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం వెల్లడైంది. ఈ స్ట్రీమింగ్ డేట్ విషయంపై హాట్‍స్టార్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

ప్రేమలు ఇలా..

థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ‘ప్రేమలు’ చిత్రం ఇటీవలే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ మూవీ అన్ని భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకే వస్తుందని ఆరంభంలో అంచనాలు వచ్చాయి. స్ట్రీమింగ్ హక్కులను కూడా అదే ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. అయితే, ఆఖర్లో ఈ సినిమా తెలుగు హక్కులను ఆహా ఓటీటీ దక్కించుకుంది. మిగిలిన భాషల్లో మాత్రం హాట్‍స్టార్ తీసుకొచ్చింది. ప్రేమలు చిత్రం తెలుగులో ఆహాలో, మలయాళం, తమిళం, హిందీల్లో హాట్‍స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మంజుమ్మల్ బాయ్స్ మాత్రం అలా కాకుండా ఐదు భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనే రానుందని ఖరారైంది.

సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పడువల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, కరుణ్ కురియన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యాం మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.

మంజుమ్మల్ బాయ్స్ మూవీని పరవ ఫిల్మ్స్ పతాకంపై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించారు. సుమారు రూ.20లోపు బడ్జెట్‍తోనే తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పటి వరకు దాదాపు రూ.235 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బంపర్ హిట్ అయింది. మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ హిట్‍గా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles