15.5 C
New York
Sunday, May 19, 2024

Buy now

SRH Kaviya Maran cars: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ లగ్జరీ కార్ల కలెక్షన్ చూశారా.. రూ.12 కోట్ల కారు కూడా..

SRH Kavya Maran cars: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నప్పుడు కెమెరాల కళ్లన్నీ ఆ టీమ్ సీఈవో కావ్య మారన్ పైనే ఉంటాయి. తన అందం, క్యూట్ లుక్స్ తో ఆమె ఆకర్షిస్తుంది. అయితే కెమెరా ముందు కనిపించే కావ్య మారన్ కంటే వెనుక ఆమెకు ఉన్న లగ్జరీ కార్లను చూస్తే మరింత షాకవడం ఖాయం. ఎందుకంటే కావ్య దగ్గర ఇప్పటికే కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి.

కావ్య మారన్ లగ్జరీ కార్లు

సినిమా స్టార్లు, క్రికెటర్లకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమన్నది అందరికీ తెలిసిందే. మన దేశంలోని స్టార్ హీరోలు, క్రికెటర్ల దగ్గర ఎన్నో కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈవోగా ఉన్న కావ్య మారన్ కు కూడా ఇలా లగ్జరీ కార్లను కొనే అలవాటు ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 32 ఏళ్ల కావ్య.. సన్ గ్రూపు ఫౌండర్ కళానిధి మారన్ కూతురు అన్న విషయం తెలిసిందే.

దీంతో ఆ మీడియా టైకూన్ కు తగినట్లుగానే కావ్య మెయింటెనెన్స్ కూడా ఉంది. రూ.400 కోట్లకుపైగా సంపద ఆమె సొంతం. ఇక కావ్య దగ్గర ఉన్న వాటిలో అన్నీ యురోపియన్ మేడ్ కార్లే కావడం విశేషం. రూ.12 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ తోపాటు పలు ఇతర కార్లు కూడా ఉన్నాయి. అవేంటో మీరూ చూడండి.

రోల్స్ రాయల్స్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యూబీ

ప్రపంచంలోని అత్యంత లగ్జరీ కార్లలో ఒకటి రోల్స్ రాయ్స్. ఈ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు చెందిన రోల్స్ రాయ్స్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యూబీ మోడల్ కారు కూడా కావ్య మారన్ దగ్గర ఉంది. ఈ కారు ధర ఏకంగా రూ.12.2 కోట్లు. ఇలాంటి కారే ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీ దగ్గర కూడా ఉంది.

బెంట్లీ బెంటేగా ఈడబ్ల్యూబీ

మరో బ్రిటీష్ లగ్జరీ కార్ మేకర్ బెంట్లీకి చెందిన బెంటేగా ఈడబ్ల్యూబీ కారు కూడా కావ్య దగ్గర ఉంది. ఈ కారు ధర ఇండియాలో రూ.6 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. కావ్య దగ్గర రెడ్ కలర్ బెంట్లీ కారు ఉంది. ఈ ఎస్‌యూవీ కారును లగ్జరీ కార్లు వాడే చాలా మంది ఇష్టపడతారు.

బీఎండబ్ల్యూ ఐ7

కావ్య మారన్ దగ్గర లగ్జరీ ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఉంది. ఈ కారు ధర ఇండియాలో రూ.2.13 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఈ జర్మన్ కార్ మేకర్ సంస్థ నుంచి వచ్చిన టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ కారు ఇది.

ఫెరారీ రోమా

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీకి చెందిన రోమా మోడల్ కారు కూడా కావ్య మారన్ గ్యారేజ్ లో ఉండటం విశేషం. ఈ కారు ధర ఇండియాలో రూ.3.76 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోదగిన కారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles