23.6 C
New York
Saturday, June 1, 2024

Buy now

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా 

posted on Apr 16, 2024 3:24PM

గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండటంతో వాయిదాపడింది. సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles