16.7 C
New York
Sunday, May 19, 2024

Buy now

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు- అర్ధరాత్రి వరకూ మెట్రో రైలు సర్వీసులు పొడిగింపు-hyderabad news in telugu new year celebrations metro rail service extended up to midnight on december 31st ,తెలంగాణ న్యూస్

Hyderabad Metro Rail : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం రాత్రి 12:15 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రో రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ప్రతీ మెట్రో రైలు, మెట్రో స్టేషన్ లలో మెట్రో భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.మెట్రో స్టేషన్ లోకి మద్యం సేవించి రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా వేస్తే ట్రైన్ ఎక్కేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని తెలియచేశారు. మెట్రో పరిధిలో ఎవరితో దుర్బాషలాడినా, ఎవరినైనా వేధించిన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ప్రయాణికులను హెచ్చరించారు. ప్రయాణికులు అంతా బాధ్యతగా వ్యవహరించి మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles