ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ( Superstar Krishna )ఇండస్ట్రీలో ఎవ్వరు చేయలేని సాహసాలను చేశారనే చెప్పాలి.ఇండస్ట్రీలో ఏది కొత్తగా రావాలన్నా అది కృష్ణ తోనే మొదలయ్యేది.

 Do You Know Who Is The Star Hero Who Missed The Movie Mosagaadu Made By Krishna-TeluguStop.com

అందుకే ఆయనను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ ఉండేవారు.ఇక అందులో భాగంగానే కృష్ణ నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక 1971 వ సంవత్సరంలో ‘మోసగాళ్లకు మోసగాడు ‘ అనే సినిమా చేసిన కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి కౌబాయ్ సినిమా చేసిన హీరోగా చరిత్ర సృష్టించాడు.

 Do You Know Who Is The Star Hero Who Missed The Movie Mosagaadu Made By Krishna-TeluguStop.com

ఇక ఈ సినిమాను హాలీవుడ్ లో వచ్చిన మెకానాస్ గోల్డ్ సినిమా( Mechanas Gold Movie ) ఇన్స్పిరేషన్ తో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమాని ఇండస్ట్రీలో అప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ కూడా చేయాలని అనుకున్నాడు.ఆయనకంటే ముందే కృష్ణ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని రెడీ చేయించుకొని ఈ సినిమా చేసి ఇండస్ట్రీలో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక దాంతో కృష్ణ చేసిన సినిమానే ఎన్టీఆర్( NTR ) చేయడం ఎందుకు అని ఆయన ఇలాంటి సినిమాలు చేయాలనే కోరికను విరమించుకున్నట్టుగా తెలుస్తుంది.

అప్పట్లో కృష్ణ ఎన్టీఆర్ మధ్య సినిమాలపరంగా మంచి పోటీ ఉండేది.ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్టుగా సినిమాలను తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ లను అందుకునేవారు.నిజానికి కృష్ణ కంటే ఎన్టీఆర్ చాలా సీనియర్ హీరో అయినప్పటికీ సినిమా పరంగా వీళ్ళ మధ్య మంచి పోటీ అయితే ఉండేది.ఇక సినిమా నుంచి బయటికి వస్తే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉండేవారు.

ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు అటెండ్ అయ్యి వాళ్ళ మధ్య సినిమాల పరంగానే పోటీ ఉంది తప్ప,పర్సనల్ గా ఎలాంటి భేదాలు లేవు మేమంతా ఒకటే అని చాటి చెప్పేవారు…

.