డబ్బులు పోగేసు కోవడం ..ధనవంతులుగా చెలామణి కావాలని అనుకోవడం మామూలే. సాఫ్ట్ వేర్ రంగం వచ్చాక అవకాశాలు అపారంగా పెరిగాయి . మీసాలు రాణి వాళ్ళు సైతం డాలర్లు సంపాదిస్తున్నారు . లెక్కలేనంత సొమ్ము చేసుకుంటున్నారు . నిత్యం డబ్బు మాయలో పడి కొట్టుకు చేస్తున్నారు . బంగ్లాలు ..భవంతులు ..కార్లు ..షికార్లు ..వస్తువులు ..స్టేటస్ సింబల్ గా మారాయి . ఆధునికత తెచ్చిన తంటా ఇది . వైన్ వాళ్ళు లేరు . చెప్పే వాళ్ళు ఉన్నా వారి గురించి మాట్లాడే సమయం ఉండటం లేదు . స్మార్ట్ ఫోన్లలో బతుకుతున్నారు..కానీ జీవించడం లేదు . ఒకరితో మరొకరు పోల్చుకోవడం తోనే కాలమంతా సరి పోతోంది . ఇక పక్క వాళ్ళతో మాట్లాడే ఓపిక ఎక్కడిది . కోట్లు వెనకేసుకున్నా..తరగని సంపద సమకూరినా కావాల్సింది మానసిక పరమైన సంతృప్తి.
 
ఇదేదీ ఇప్పటి జనాలకు ఉండటం లేదు . అంతటా టెన్షన్ ..అంతులేని వత్తిడి . దీనిని తట్టుకోలేక ఇంకొన్ని వ్యసనాలకు బానిసై పోతున్నారు . బాంధవ్యాలు మరిచి ..వావి వరుసలు లేకుండానే సంబంధాలను కలిపేసుకుంటున్నారు . తల్లిదండ్రులంటే గౌరవం లేదు ..పెద్ద వాళ్ళు చెబితే చెవికెక్కదు . ఎంత సంపాదించినా కాపాడు కోవడం చేత కాదు. పొద్దున్న లేస్తే ..పడుకునే దాకా మొబైల్స్ తోనే సహవాసం . ఓ వైపు పేరెంట్స్ ఇంకో వైపు పిల్లలు ..వాళ్ళ మీద ఆధార పడ్డ వాళ్ళ పరిస్థితి ఘోరం . ధనవంతులుగా ..డబ్బున్న వాళ్ళుగా ఎలాగైనా బాతోకొచ్చు ..కానీ అత్యంత సామాన్యంగా ..సాధారణంగా బతకాలంటే ..ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం .
 
అందుకే మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ అంటారు ..మామూలుగా బతకాలంటే సాధన చేయాలి . చాలా ఓపిక కావలి . ఉన్న దానితో సంతృప్తి చెందాలి . ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి . అహాన్ని వీడాలి . ప్రేమను పెంచు కోవాలి . ఎంత ఎత్తులో ఉన్నా ..శిఖరాలను అది రోహించినా ..ఇంకా కళ్ళు నేల మీదనే ఉండాలి అప్పుడే అతి సాధారణంగా బతికేందుకు వీలవుతుంది . కాలం మారింది . జనంలో మార్పు వచ్చింది . యువతీ యువకులలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి . వారిలో సంపాదించే ధైర్యం ఉన్నా తాము నిలబడేందుకు భరోసా ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి తాము ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నారు . సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నారు . ఇవ్వడం లో ఉన్నంత తృప్తి తీసు కోవడంలో ఉండదు అంటున్నారు .
 
ప్రపంచాన్ని గాంధీజీ చూపినంత ప్రభావం ఇంకే నాయకుడు కలిగించడం లేదు . ఆయన ఏది చెప్పారో అదే ఆచరించారు . విలువలకు కట్టు బడ్డారు . సత్యం కోసం నిలబడ్డారు . జాతి కోసం ప్రాణాలు కోల్పోయారు . ఆహార్యంలోను ..జీవితంలోను ..ఒకే రీతిగా ఉన్నారు ..అందుకే ఆ మహాత్ముడు చెప్పిన మాటాలే మనకు ఆదర్శ ప్రాయంగా నిలిచి పోయాయి . నా జీవితమే నా సందేశం అన్నారు . ఇదే ఇప్పుడు ఈ లోకాన్ని నడిపిస్తోంది . కోరికలు తీర్చుకోలేక ..అలవాట్లను మార్చుకోలేక ..విజయాలు అందుకోలేక ..విలువైన కాలాన్ని ..లైఫ్ ను కోల్పోతున్న వారంతా ఇప్పుడు మళ్ళీ తమను తాము పరిశీలించుకుంటున్నారు .
 
మంచి మార్పు .. కాదనలేం . అవును మనం సింపుల్ గా ఉండలేమా ..బతకడం చేత కాదా .. అంటే సాధన చేయాలి . ఆలోచనలను అదుపులో ఉంచు కోవాలి . కోరికలను నియంత్రించు కోవాలి . ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్లంతా గొప్పవాళ్లే ..కానీ సామాన్యంగా బతికారు . కలాం , గాంధీ , స్టీవ్ జాబ్స్ లాంటి వారు ఎందరో . డబ్బులు ఉన్నాయని ..ఆస్తులు సంపాదించామని మురిసి పోకండి . జీవితం కొద్దీ సేపే ..దానిని గుర్తుంచుకుని..బతకడం కాకుండా జీవించే ప్రయత్నం చేయండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here