మానవుల ప్రమేయం లేకుండానే ప్రపంచంలో పనులు జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచించిన వాళ్లకు షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి రోబోస్. ఇప్పటికే లాజిస్టిక్ రంగం లోకి ఇవి ఎంటర్ అయ్యాయి. వీటితో బలమైన పనులే కాదు, స్టోర్స్ , మాల్స్ లలో విరివిగా వాడుతున్నారు. ఇప్పటికింకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేక పోయినప్పటికీ ..ఇది ప్రమాదకర సంకేతంగా భావనిచాల్సి ఉంటుంది. అదేమిటంటే అన్ని కంపెనీలు రోబోలను వాడుతూ పోతే, ఇక సిబ్బంది, ఉద్యోగులు, కార్మికుల అవసరం ఉండదు. 

అప్పుడు కోట్లాది మందికి బతికేందుకు కొలువులంటూ ఉండవు. వందలాది మందితో చేసే పనుల్ని ఈ రోబోలు అవలీలగా చేసేస్తున్నాయి. నిన్నటి దాకా స్టోర్స్, మాల్స్ , కంపెనీలకే పరిమితమై పోయిన రోబోలు ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలోని రోడ్లపైకి వచ్చాయి. ఎందుకని అనుకుంటున్నారా లాజిస్టిక్ , ఈ కామర్స్ రంగంలో టాప్ రేంజ్ లో ఉంటున్న అమెజాన్ కంపెనీ ఏకంగా ఈ రోబోలను ప్రాడక్ట్స్ ను బుకింగ్ చేసిన కస్టమర్లకు డెలివరీ చేసేందుకు ఈ రోబోలను వదిలారు. అంతకు ముందు వీటికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రోడ్ సేఫ్టీ గురించి , ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. 

డెలివరీ చేసే వారి చిరునామాను అక్కడికి నేరుగా అందజేసేలా రూట్ మ్యాప్ కూడా చేర్చారు. తాజాగా రోబోలతో చేసిన ప్రయోగం ఫలించింది. దీంతో అమెజాన్ పూర్తి ఆనందంలో ఉంది. ఎనుకంటె ఇటీవలే జీతాలు పెంచాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో కోట్లాది రూపాయలు నష్ట పోయింది. టెస్టింగ్ కోసమని ఈ కంపెనీ దక్షిణ కాలిఫోర్నియా లో మొదటి సారిగా చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోలే రాజ్యం చెలాయించే ప్రమాదం పొంచి ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here