ఏ ఒక్క‌రు పేద‌రికం కార‌ణంగా చ‌దువు కోకుండా వుండడానికి వీలు లేదు. ప్ర‌తి ఒక్క‌రు అక్షరాలు నేర్వాలి. విద్య లేక పోతే జీవితానికి అర్థం అంటూ ఏమీ ఉండ‌దు. తాము చ‌దువుకుంటూ ఇత‌రుల‌కు నేర్పేలా ఎద‌గాలి. అప్పుడే ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బుల‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. ఇందు కోసం స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికైనా సిద్ధంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, యువ నాయ‌కుడు జ‌గ‌న్మ్‌హ‌న్ రెడ్డి. విద్యా శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం ..కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. పేద‌ల‌కు అండ‌గా ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే వారికి అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ కాలేజీల‌తో పాటు ప్రైవేట్ క‌ళాశాల‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు మ‌రింత ల‌బ్ధి చేకూరుతుంది.
 
అర‌కులో గిరిజ‌న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా గిరిజ‌న విశ్వ విద్యాల‌యం, వైద్య క‌ళాశాలను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. వృత్తి విద్య‌ల‌కు సంబంధించి ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పాఠ‌శాల‌ల‌ల నిర్మాణంలో గ‌త స‌ర్కార్ తీసుకున్న యూన్యూటీ విధానాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే యూనివ‌ర్శిటీలు ఏర్పాటు చేస్తామంటూ విలువైన భూములు తీసుకుని ..ఇంకా ఏర్పాటు చేయ‌ని వారి వివ‌రాలు వెంట‌నే వెల్ల‌డించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. స‌ర్కార్ విద్యా సంస్థ‌లు లేక పోతే పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన పిల్ల‌లు చ‌దువుకోలేరు. ఇపుడున్న ఫీజుల‌ను చూస్తే ఏ ఒక్క‌రూ చ‌దువుల‌ను భ‌రించే స్థితిలో లేరు. స‌ర్కార్ విద్యా సంస్థ‌ల్లో ప్రాథ‌మిక స‌దుపాయాల‌ను క‌ల్పించి నాణ్య‌మైన చ‌దువును అందించాల‌న్న‌ది మా స‌ర్కార్ ప్ర‌ధాన ల‌క్ష్యాల‌లో ఒక‌టి అని జ‌గ‌న్ చెప్పారు. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆస్తులు, అంత‌స్తులు , నోట్ల క‌ట్ట‌లు మేం ఇవ్వ‌ద‌ల్చుకోలేదు. అంత‌కంటే గొప్ప‌నైనా ఆస్తిని మీకు అంద‌జేయాల‌ని సంక‌ల్పించాం.
 
అది బంగారం, వెండి, వ‌జ్రాల‌కంటే విలువైన‌ది ..అదే చ‌దువు ఒక్క‌టేన‌ని ఈ విష‌యాన్ని గుర్తించి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప‌నుల్లో కాకుండా బ‌డుల్లో ఉండేలా చూడాల‌ని పిలుపునిచ్చారు. అందుకే విద్య‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా పిల్ల‌ల‌ను బ‌డుల‌కు పంపించే త‌ల్లుల‌కు ఏడాదికి 15 వేల రూపాయ‌లు ఇచ్చే అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ..ఇంట‌ర్ విద్యార్థుల‌కు వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డుదారులై వుండి ప్రైవేట్ కాలేజీలలో చ‌దువుకుంటున్న ఏ కులానికి చెందిన వారైనా స‌రే ..వారికి కూడా అమ్మ ఒడిని వ‌ర్తింప చేస్తున్న‌ట్లు తెలిపారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కం అమ‌లయ్యాక ఉన్న‌త విద్య చదివే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరింద‌న్నారు. కాలేజీల ఫీజులు, రీయింబ‌ర్స్ మెంట్ ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌ని..ప‌రిశీలించి ప్రామాణీక‌రించాల‌ని సూచించారు. రాష్టంలో ఖాళీగా ఉన్న యూనివ‌ర్శిటీ వీసీల పోస్టుల‌ను నెల రోజుల్లో భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశిచంఆరు. పిల్లలు బడిలో చేరిన దగ్గర నుంచి వారిని ఉద్యోగాల స్థాయి వరకూ తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.మొత్తం మీద విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టే ప‌నిలో ప‌డ్డారు యువ నాయ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here