Site icon janavahinitv

మావోయిస్ట్‌కు నివాళులు అర్పించిన మంత్రి సీతక్క… తెలంగాణలో నయా ట్రెండ్‌గా మారిన సంతాపం-minister sitakka pays tribute to maoist mourning has become a new trend in telangana ,తెలంగాణ న్యూస్

Minister Seethakka: తుపాకిగొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని నినదించిన మావోయిస్టులు Maoist మరణిస్తే ఇంతకాలం అటువైపు కన్నెత్తి చూడని రాజకీయ నాయకులు ఇప్పుడు నివాళులు tributes అర్పిస్తుండడం సరికొత్త సాంప్రాదాయానికి new trend తెరతీసినట్టయింది.

అధికార పార్టీ నాయకులు సైతం నక్సల్స్ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తుండడంతో నయా ట్రెండ్ మొదలైనట్టు స్పష్టమవుతోంది. అజ్ఞాతంలో ఉంటూ రాజ్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మరణించిన నక్సలైట్లకు నివాళులు అర్పించే సంస్కృతి ప్రారంభం కావడం తెలంగాణాలో సరికొత్త సాంప్రదాయం సాగుతుందా అనే చర్చసాగుతుంది.

ఇటీవల చత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లాలో జరిగిన బారీ ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఎన్ కౌంటర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ మరణించారు. మరణించిన మావోయిస్టు శంకర్ కు రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు.

బుధవారం చల్లగరిగె గ్రామాన్ని సందర్శించిన సీతక్క, శంకర్ ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించడంతో పాటు ఆయన తల్లిని కూడా పరామర్శించారు. అజ్ఞాతంలో ఉంటూ ఎన్ కౌంటర్ లో మరణించిన వ్యక్తికి క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి సంతాపం తెలపడం సచంలనంగా మారింది.

గత సంవత్సరం చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ముఖ్యనేత కటుకం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందారు. సుదర్శన్ మృతి వార్త తెలిసి విప్లవ భావజాలం ఉన్న వారితో పాటు సుదర్శన్ గురించి తెలిసిన వారంతా బాధపడ్డారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన సుదర్శన్ కుటుంబసభ్యులను పరామర్శించి నివాళులు అర్పించారు.

అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కటుకం విప్లవపంథా వైపు వెల్లిన తీరును కొనియాడారు. ఒకప్పుడు విప్లవ పంథాలో వెల్లి చనిపోయిన వారి గురించి పట్టించుకోని పొలిటికల్ లీడర్లు ఇప్పుడు మాత్రం బాహాటంగానే నివాళులు అర్పిస్తుండడం సంచలనంగా మారింది.

అప్పట్లో..

1990వ దశాబ్దంలో పీపుల్స్ వార్ కు చెందిన హేమ్ చందర్ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మంథని సమీపంలోని అరెందలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెల్లిన అప్పటి స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వెళ్ళగా గ్రామస్థులు హేమ చందర్ ఎన్ కౌంటర్ లో మరణించిన విషయాన్ని తెలియజేయడంతో అక్కడి నుండే సంతాపం ప్రకటించారు. ఈ విషయం పత్రికల్లో రాగానే పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఇప్పుడు మాత్రం అడవి బాట పట్టి చనిపోయిన వారికి సంతాపం తెలపడం సాధారణ విషయంగా మారిపోవడం గమనార్హం.

పోలీసులు అలా…

ఇకపోతే విప్లవ పంథాలో సాగుతున్న అజ్ఞాత నక్సల్స్ జనజీవనంలో కలవాలని పోలీసులు Ts Policeపిలుపునిస్తున్నారు. తాజాగా రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ తో పాటు పోలీసు అధికారులు ప్రత్యేకంగా పోస్టర్లను విడుదల చేశారు. అడవి బాటను వీడి ప్రజాస్వామ్య బద్దంగా జనజీవనంలో కలవడమే కాకుండా చట్టసభలకు ఎన్నికై పోలీసుల నుండి గౌరవం పొందుతున్న విషయాన్ని గమనించి బాహ్య ప్రపంచంలోకి రావాలని కూడా పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో చేరి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. అయితే రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు మాత్రం అజ్ఞాతంలో ఉంటూ మరణించిన వారికి సంతాపాలు ప్రకటిస్తుండడం విశేషం.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, కరీంనగర్)

Exit mobile version