Site icon janavahinitv

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం | nomination filing deadline closed in telugu states| may 13th| poling| june| 4th

posted on Apr 25, 2024 4:10PM

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం మూడుగంటలతో ముగిసింది. 

ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4, 210 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక తెలంగాణలోని 17లోక్ సభ స్థానాలకు గాను 603 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది.

 అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లను రేపు పురిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది.  మే 13న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.

Exit mobile version