posted on Apr 24, 2024 1:02PM
ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది.
అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు.
అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే… కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.