Site icon janavahinitv

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే!-hyderabad ts inter results 2024 released ts supplementary exam schedule recounting revaluation details ,తెలంగాణ న్యూస్

TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను(TS Inter Results 2024) విద్యాశాఖ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫెయిల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్(TS Inter Supplementary Exams) ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఇంటర్ బోర్డు(Telangana Inter Board) అధికారులు సూచించారు. అలాగే తక్కువ మార్కులు వచ్చినట్లు భావిస్తే విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలను(Advanced Supplementary Exams) మే 24 వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రీకౌంటింగ్(Recounting), రీవాల్యూయేషన్ (Revaluation)కు సబ్జెక్టు వారీగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్(TS Inter Supplementary Exams 2024 Time Table)- మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి.

Exit mobile version