Site icon janavahinitv

సివిల్స్ 2023 ఫలితాలు.. తెలుగమ్మాయికి మూడో ర్యాంక్ | telugu girl cirils third rank| civils results| upsc results| telangana girl upsc

posted on Apr 16, 2024 4:31PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ (2023) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కి చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. అలాగే ఈసారి ఫలితాలో ప్రథమ ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంకును అనిమేష్ ప్రధాన్ సొంతం చేసుకోగా, మూడో ర్యాంకర్‌గా తెలుగమ్మాయి అనన్య రెడ్డి నిలిచారు. గత సంవత్సరం కూడా తెలంగాణకే చెందిన ఉమా హారతి మూడో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా మూడో ర్యాంకు తెలుగమ్మాయికే రావడం విశేషం.

ఇదిలా వుండగా, సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు యువతీ యువకుడు ర్యాంకుల పంట పండించారు. నందల సాయికిరణ్ (27), మేరుగు కౌశిక్ (82), పెంకీసు ధీరజ్ రెడ్డి (173), జి.అక్షయ్ దీపక్ (196), గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ (198) నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి (382), బన్న వెంకటేష్ (467), కడుమూరి హరిప్రసాద్ రాజు (475), పూల ధనుష్ (480), కె.శ్రీనివాసులు (526), నెల్లూరు సాయితేజ (558), కిరణ్ సాయింపు (568), మర్రిపాటి నాగ భరత్ (580), పోతుపురెడ్డి భార్గవ్ (590), కె.అర్పిత (639), ఐశ్వర్య నెల్లి శ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్ రాజ్‌కుమార్ (703), గాదె శ్వేత (711), వి.ధనుంజయ్ కుమార్ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సంపత్ కుమార్ (830), జె.రాహుల్ (873), హనిత వేములపాటలి (887), కె.శశికాంత్  (891), కెసారపు మీన (899), రావూరి సాయి అలేఖ్య (995), గోవద నవ్యశ్రీ (995) ర్యాంకులు సాధించారు.

Exit mobile version