Site icon janavahinitv

Bhagwant Mann: 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్..

Bhagwant Mann becomes proud father: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పాటు నవజాత శిశువు ఫోటోను భగవంత్ మాన్ షేర్ చేశాడు. ‘‘సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భగవంత్ మాన్ పంజాబీలో ‘ఎక్స్’లో (గతంలో ట్విటర్) పేర్కొన్నారు. మరో పోస్టులో 50 ఏళ్ల మాన్ తన చిన్న బిడ్డ ఫోటోను షేర్ చేశారు. భగవంత్ మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. మాన్ కు ఆ వివాహం ద్వారా ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. వీరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022 లో సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version