Site icon janavahinitv

Bank holidays: ఈ శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయి.. కానీ ఈ విషయాలు గమనించండి..

ఆ తేదీల్లో ఏ లావాదేవీలు చేయవచ్చు?

  1. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) వ్యవస్థ ద్వారా లావాదేవీలు కొనసాగుతాయి.
  2. ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన అన్ని చెక్కులను క్లియర్ చేస్తాయి. ఆ రోజు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన చెక్కులను ఆయా బ్యాంకుల్లో సమర్పించవచ్చు.

ఏజెన్సీ బ్యాంకులు అంటే ఏమిటి?

ఆర్బీఐ (RBI) వెబ్ సైట్ ప్రకారం, “ఆర్బీఐ తన సొంత కార్యాలయాలతో పాటు, తన ఏజెంట్లుగా నియమించుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాల సాధారణ బ్యాంకింగ్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45 ప్రకారం, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను భారతదేశంలోని అన్ని ప్రదేశాలలో లేదా ఎక్కడైనా ఏజెంట్లుగా నియమించడానికి ఆర్బీఐకి వీలు కల్పిస్తుంది.

Exit mobile version