Site icon janavahinitv

AP TET Results 2024 : ఆ తర్వాతే ఏపీ ‘టెట్’ ఫలితాలు – విద్యాశాఖ నుంచి తాజా అప్డేట్ ఇదే

Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి… స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మరోవైపు ఏపీ డీఎస్సీ (AP DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా…  మార్చి 20వ తేదీ నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.ఈ మేరకు వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మార్చి 25 నుంచి అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అవుతుండగా… ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.

Exit mobile version