Site icon janavahinitv

చంద్రునిపై ఉన్న ఏకైక సమాధి ఈయనదే, ఈ వ్యక్తి ఎవరు?-he is the only tomb on the moon who is this person ,లైఫ్‌స్టైల్ న్యూస్

షూమేకర్ జూలై 18, 1997లో ఆస్ట్రేలియాలో ఒక ఉల్కాపాతం గురించి పరిశోధన చేస్తున్నప్పుడు కారు ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఆయన వయసు 69 ఏళ్లు. ఆయన జీవించి ఉన్నప్పుడు అతనికి ఉన్న ఒకే ఒక కోరిక చంద్రుడిని పై అడుగు పెట్టాలని. కానీ ఆయన జీవించి ఉండగా ఆ కోరిక తీరలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఆ దహన సంస్కారాలలో మిగిలిన అవశేషాలను, బూడిదను చంద్రుడి పైకి పంపాలని అనుకున్నారు. అందుకోసం సెలెస్టిస్ అనే సంస్థను సంప్రదించారు. షూమేకర్ బూడిద ఉన్న చిన్న క్యాప్సూల్ ను చంద్రుపైకి పంపడానికి ఒప్పుకుంది ఆ సంస్థ. ఆ క్యాప్సుల్లో షూమేకర్ ఫోటోతో పాటు, అతని పేరు, జనన మరణ తేదీలు, అతని శరీర బూడిద ఉంది. 1999లో ఈ క్యాప్సూల్ ను చంద్రునిపై చేరేలా చేశారు. ఇలా చంద్రునిపై ఖననమైన ఒకే ఒక వ్యక్తిగా షూమేకర్. ఇదొక చరిత్ర అనే చెప్పుకోవాలి. అయితే ఈ షూమేకర్ క్యాప్సూల్ ఎక్కడ పడిందో అనేది మాత్రం అస్పష్టంగానే ఉంది. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు, కాబట్టి ఈ క్యాప్సూల్ వందల ఏళ్ళ పాటు సురక్షితంగా ఉంటుంది.

Exit mobile version