Home ఆంధ్రప్రదేశ్ AP New Liquor Policy : మందుబాబులకు అదిరిపోయే న్యూస్, కేబినెట్ ఆమోదం లభిస్తే చాలు-ఇక...

AP New Liquor Policy : మందుబాబులకు అదిరిపోయే న్యూస్, కేబినెట్ ఆమోదం లభిస్తే చాలు-ఇక అక్టోబర్ 1 నుంచి!

0

AP New Liquor Policy : వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాల్లో మద్యం పాలసీ కూడా ఒకటని విశ్లేషకుల విశ్లేషణ. మద్యం రేట్లు భారీగా పెంచడం, ఎవరికీ తెలియని బ్రాండ్లు, నాణ్యతలేని మద్యంతో…మందుబాబులు విసిగిపోయి కూటమి వైపు చూశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యంతో పాటు, లిక్కర్ రేట్లు తగ్గిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఇక మా వంతు ఎప్పుడా అని మందుబాబులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి నూతన విధానం అమలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే నూతన మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల మద్యం విధానాలపై అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకురాబోతుంది.

Exit mobile version