నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ ఎ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెరుగైన జీవక్రియకు మద్దతునిస్తాయి. బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇక బెల్లం లోని ఉండే సహజ చక్కెర స్థిరమైన శక్తిని శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. శుద్ధి చేసిన చక్కెర ఒకేసారి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. బెల్లం మాత్రం స్థిరంగా కొంచెం కొంచెంగా శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి పద్ధతి. బెల్లం శక్తివంతమైన డీ టాక్సీఫికేషన్ గా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో విషాన్ని బయటికి పంపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి, బెల్లం కలిపి తినేందుకు ప్రయత్నించండి.