Home ఆంధ్రప్రదేశ్ AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30...

AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

0

AP e-crop Booking : ప్రకృతి వైపరీత్యాలలో మొదటిగా నష్టపోయేది రైతులే. వర్షాలు, వరదలు, ఎండలు, వివిధ వాతావరణ పరిస్థితులతో అన్నదాతకు ఆరుగాలం కష్టమే. అయితే రైతన్నల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు బీమా పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుండగా, వివిధ రాష్ట్రాలు ఈ పథకానికే సొంత పేర్లు పెట్టుకుని అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటల కోసం 2%, రబీ పంటల కోసం 1.5%, వార్షిక వాణిజ్య పంటల కోసం 5% రైతులు చెల్లించాలి. అయితే రైతులపై భారం పడకుండా ఈ ప్రీమియంలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి.

Exit mobile version