LIC Jeevan Utsav Plan : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాతో ఒక ప్లాన్ ను అందిస్తుంది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ‘ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్’ ప్లాన్ ద్వారా జీవితకాలం పాటు బీమా కవరేజీని అందిస్తుంది. పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లిస్తారు, ఆ తర్వాత కొంత కాలం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అనంతరం ప్రతి ఏడాది రిటర్స్న్ పొందుతారు. ఈ ప్లాన్ ను 90 రోజుల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి అందుబాటులో ఉంది. ఇది జీవితకాల ఆదాయాన్ని, బీమా కవరేజీని అందిస్తుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి తప్పనిసరిగా కనీసం ఐదు సంవత్సరాలు, గరిష్టంగా 16 సంవత్సరాలు ఉండాలి.