Home ఆంధ్రప్రదేశ్ Rajahmundry Leopard Movement : రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం, సీసీటీవీ దృశ్యాలు వైరల్

Rajahmundry Leopard Movement : రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం, సీసీటీవీ దృశ్యాలు వైరల్

0

రాజానగరం మండలంలోని లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో చిరుత సంచరించి ఒక జంతువును నోట కరుచుకొని వెళ్లిందనే స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఉన్న పాదముద్రలను కనిపించాయి. అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి పుష్కరవనంలో జంతువుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడే జంతువులను బంధించేందుకు ఒక బోను కూడా ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ సెక్షన్ డీఆర్ఐ పద్మావతి పేర్కొన్నారు.

Exit mobile version