“బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి చేశాం. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డాం. సీఎం 24 గంటలు కలెక్టరేట్‍లో, క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పనులు పర్యవేక్షించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మా ప్రభుత్వం మొత్తం ప్రజా సేవలోనే ఉంది. ముఖ్యమంత్రి కలెక్టరేట్‍లో, మంత్రులు కట్టల మీద, ఎమ్మెల్యేలు లంకల్లో ఉండి, ప్రజల కోసం ప్రతి క్షణం కష్టపడ్డాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు మాకు ప్రజాసేవపై ఉండే నిబద్ధత.”- మంత్రి నిమ్మల రామానాయుడు