మెండిస్ ఒంటరి పోరు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ అనూహ్యరీతిలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు నిషాన్ మదుశంక (7), కరుణరత్నె (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ (22), చండిమాల్ (23), ధనంజయ డిసిల్వా (0) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో శ్రీలంక 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ దశలో కామిండు మెండిస్ (74: 120 బంతుల్లో 8×4, 3×6) అసాధారణ పోరాట పటిమను కనబర్చాడు.