Home ఆంధ్రప్రదేశ్ Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత

Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత

0

ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్‌రూమ్‌లలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు చెబుతున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసినా యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలను ఎక్స్‌లో వైరల్‌గా మారాయి.

Exit mobile version