Home లైఫ్ స్టైల్ నీటి మీద తేలే ముగ్గు, నీరు పోసినా చెదరని ముగ్గు మీరూ వేయొచ్చు, ఈ సీక్రెట్...

నీటి మీద తేలే ముగ్గు, నీరు పోసినా చెదరని ముగ్గు మీరూ వేయొచ్చు, ఈ సీక్రెట్ తెల్సుకోండి చాలు-how to make floating water and under water rangoli for ganesh chathurthi ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఫ్లోటింగ్ ఫ్లవర్ రంగోలీ:

తాంబాలంలో నీల్లు పోసి మీద పూరేకులతో అలంకరిస్తే పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే పూరేకులు, పూలు మునిగిపోతూ ఉంటాయి. అలా జరక్కుండా ఒక చిన్న ప్లేటు, దాని వెడల్పుకు సరిపోయే కొన్ని బాంబూ స్టిక్స్, ఐస్ క్రీం స్టిక్స్ లేదా ఇంకేవైనా పుల్లలు కొన్ని తీసుకోండి. తాంబాలంలో నీళ్లు నింపి ఉపరితలం మీద అటూ ఇటూ పుల్లలు అడ్డుగా నిలువుగా పేర్చండి. అలా చేస్తే చిన్న చిన్న గడులు రెడీ అవుతాయి. వాటి మధ్యలో పూలు పెట్టారంటే రోజు మొత్తం చెక్కరకుండా పూల రంగోలీ ఉంటుంది. నీటిలో తేలినట్లే కనిపిస్తుంది. పూలు బరువుగా ఉంటాయి కాబట్టి ఈ ఏర్పాటుతో తొందరగా మునిగిపోవు. పూరేకులయితే నేరుగా నీటిమీద చల్లితే సరిపోతుంది.

Exit mobile version