కస్టడీలో ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారని, తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదులో ఆరోపించారు. 2021లో హైదరాబాద్‌లో ఉన్న తనను కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో అరెస్టు చేశారని, ఆ సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న పోలీసు అధికారి ఆర్ విజయ పాల్, ప్రభుత్వ వైద్యురాలు జి.ప్రభావతి ప్రమేయం ఉందని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేశారని రఘురామ ఆరోపించారు.