జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలు దాడికి తెగబడ్డారు. కొంతమంది భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. దీంతో 10 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి తప్పించే సమయంలో బస్సు లోయలో పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకార చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరగటం కలకలం రేపుతోంది. ఘటనపై సమీక్ష నిర్వహించిన మోడీ.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.