Home ఆంధ్రప్రదేశ్ Janasena : కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ప‌వ‌న్ అడ‌గ‌లేదా? బీజేపీ ఇవ్వలేదా?

Janasena : కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ప‌వ‌న్ అడ‌గ‌లేదా? బీజేపీ ఇవ్వలేదా?

0

71 మందితో కేంద్ర కేబినెట్

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినేట్ మంత్రులు కాగా, 36 మంది స‌హాయ మంత్రులు ఉన్నారు. మ‌రో ఐదుగురు స్వతంత్ర హోదా క‌లిగిన మంత్రులు ఉన్నారు. 71 మందిలో 60 మంది బీజేపీకి చెందిన మంత్రులే. మిగిలిన 11 మంది మంత్రి ప‌ద‌వులు ఏన్‌డీఏ కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల‌కు ఇచ్చారు. ఇందులో టీడీపీకి రెండు, జేడీయూకి రెండు, జేడీఎస్‌, ఎల్‌జేపీ, ఆర్ఎల్‌డీ, శివ‌సేన (షిండే), అప్నాద‌ళ్, హెచ్ఎఎం, ఆర్‌పీఐ పార్టీల‌కు ఒక్కొక్క మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. వీటిలో టీడీపీకి ఒక కేబినేట్‌, ఒక స‌హాయ మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. జేడీయూకి కూడా ఒక కేబినేట్‌, ఒక స‌హాయ మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. జేడీఎస్‌, ఎల్‌జేపీ, హెచ్ఎఎంల‌కు కేబినేట్ ప‌ద‌వి ద‌క్కింది. మిగిలిన నాలుగు పార్టీల‌కు కేవ‌లం స‌హాయ మంత్రి ప‌దవులే ద‌క్కాయి.

Exit mobile version