Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi Promo: పెళ్లి పీట‌ల‌పై రాజ్ – ఓడిపోనివ్వ‌న‌ని భ‌ర్త‌కు మాటిచ్చిన కావ్య – కాలేజీకి...

Brahmamudi Promo: పెళ్లి పీట‌ల‌పై రాజ్ – ఓడిపోనివ్వ‌న‌ని భ‌ర్త‌కు మాటిచ్చిన కావ్య – కాలేజీకి దూర‌మైన వ‌సుధార‌

0

ధాన్య‌ల‌క్ష్మి రెడీ…

రాజ్‌, మాయ‌ల పెళ్లికి ధాన్య‌ల‌క్ష్మి రెడీ అవుతుంది. ఆ పెళ్లిని ఎలా ఆపాలో తెలియ‌క ప్ర‌కాశం ఆలోచిస్తుంటాడు. కానీ అప‌ర్ణ మాట‌కు ఎదురుచెప్ప‌లేక ఇద్ద‌రు మౌనంగా ఉండిపోతారు. మాయ‌ను ఇంట్లో నుంచి పంపించే దారుల‌న్నీ మూసుకుపోవ‌డంతో తాను ఓడిపోయాన‌ని కావ్య‌తో అంటాడు రాజ్. తాను ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ప‌డ్డాన‌ని చెబుతాడు. నువ్వు త‌ప్ప న‌న్ను గ‌ట్టెక్కించేవాళ్లు లేర‌ని కావ్య‌ను వేడుకుంటాడు. అమ్మ కోసం నేను బ‌లికాలేన‌ని, నా కోసం అమ్మ‌ను బ‌లిచేయ‌లేన‌ని కావ్య‌తో చెబుతాడు రాజ్‌. తాను ఉండ‌గా మిమ్మ‌ల్ని ఓడిపోనివ్వ‌న‌ని రాజ్‌కు మాటిస్తుంది కావ్య‌.

Exit mobile version