Home ఆంధ్రప్రదేశ్ Kodali Nani On Attacks : రెండు రోజుల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి, దాడులపై హైకోర్టులో...

Kodali Nani On Attacks : రెండు రోజుల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి, దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

0

టీడీపీ వర్సెస్ వైసీపీ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అనంతరం కూటమి పార్టీల మద్దతుదారులు వైసీపీ శ్రేణుల లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమపై ఇదే తరహాలో దాడులకు పాల్పడ్డారని, అందుకు ప్రతికార చర్యలుగా ఈ దాడులు చేస్తున్నట్లు కొందరు నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన దేవినేని అవినాష్ ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతలను అదుపు చేయాలని, వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్… వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, గవర్నర్ కల్పించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.

Exit mobile version