Home ఎంటర్టైన్మెంట్ Indian 2 Update: స్పోర్ట్స్ ఛానెల్‌లో వినూత్నంగా ఇండియన్ 2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేది ఆరోజే!

Indian 2 Update: స్పోర్ట్స్ ఛానెల్‌లో వినూత్నంగా ఇండియన్ 2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేది ఆరోజే!

0

Indian 2 Update: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేష‌న్‌లో వస్తోన్న మరో సినిమా భారతీయుడు 2. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్-శంకర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది ఇండియన్ మూవీ.

విజువల్ వండర్‌గా

ఈ ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా తెలుగులో విడుదల చేశారు. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది భారతీయుడు సినిమా. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జూలై 12న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్

లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో (Mumbai Star Sports Channel) ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్రారంభించటం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకను ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మ‌న దేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోందని.. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

ఇదిలా ఉంటే, భారతీయుడు మూవీలోని ఫస్ట్ సింగిల్‌ను (Indian 2 First Single) ఈ నెల 22వ తేదిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అందులో కొన్ని ఫొటోలు కూడా పంచుకున్నాడు. వాటిలో ఎడారిలో గుర్రంపై కూర్చుని ఓ వ్యక్తి వస్తున్నట్లుగా ఉంది. అతని వెనుక ఓ గొడ్డలి కూడా ఉంది.

కల్కి 2898 ఏడీలో

అయితే, సాయంత్రం సమంయలో సూర్యుడి వెలుగులో ఉన్నట్లుగా వ్యక్తిని చూపించారు. కానీ మొహం మాత్రం స్పష్టంగా కనిపించట్లేదు. అది ఉలగ నాయగన్ కమల్ హాసన్ అయి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల విక్రమ్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కమల్ హాసన్ కల్కి 2898 ఏడీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కాగా క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారతీయుడు 2 చిత్రంలో సిద్ధార్థ్‌ (Siddharth), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రియా భ‌వానీ శంక‌ర్‌ (Priya Bhavani Shankar), ఎస్‌.జె. సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నారు.

 

Exit mobile version