Home ఆంధ్రప్రదేశ్ IRCTC Thailand Tour : 6 రోజుల థాయ్లాండ్ ట్రిప్ – ఐల్యాండ్ లో స్పీడ్...

IRCTC Thailand Tour : 6 రోజుల థాయ్లాండ్ ట్రిప్ – ఐల్యాండ్ లో స్పీడ్ బోట్ జర్నీ, మరెన్నో టూరిజం స్పాట్స్! ఇదిగో ప్యాకేజీ

0

IRCTC Vizag Thailand Tour Package 2024: వైజాగ్ నుంచి డైరెక్ట్ గా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చిన ఐఆర్ సీటీసీ… అతి తక్కువ ధరలోనే వాటిని ఆపరేట్ చేస్తోంది. ఇందులో ట్రైన్ తో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే థాయ్ లాండ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాకేజీ మాత్రం.. ప్రస్తుతం అందుబాటులో లేదు. సెప్టెంబర్ 7, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఇందుకు సంంబధించిన వివరాలను ఇక్కడ చూద్దాం….

వైజాగ్ టూ థాయ్లాండ్ ప్యాకేజీ వివరాలు:

  • వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
  • MAGICAL THAILAND EX VISHAKHAPATNAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
  • 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వైజాగ్ నుంచి అందుబాటులో ఉంటుంది.
  • సెప్టెంబర్ 7, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.
  • ఫస్ట్ డే వచ్చేసి… విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ముందుగా బ్యాకాంక్ కు(Flight No. FD-117) చేరుకుంచారు.
  • రెండో రోజు వచ్చేసి…. పట్టాయాకు వెళ్తారు. లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత Nong Nooch Garden Tour ఉంటుంది. రాత్రి పట్టాయాలోనే ఉంటారు.
  • మూడో రోజు టిఫిన్ చేసిన తర్వాత,,, Coral Island Tourకు వెళ్తారు. స్పీడ్ బోట్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత పట్టాయాకు వస్తారు.
  • నాల్గోవ రోజు సఫారీకి వెళ్తారు. ఆ తర్వాత బ్యాకాంక్ కు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు.
  • ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. Half day City Tour ఉంటుంది. ఇందులో భాగంగా గోల్డెన్ బుద్దాను చూస్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ ఉంటుంది. ఆ తర్వాత Shri Racha Tiger Zooకి వెళ్తారు.
  • ఆరో రోజు ఉదయం Grand Palaceను సందర్శిస్తారు. లంచ్ తర్వాత సాయంత్రం 6 గంటలకు బ్యాకాంక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు విశాఖకు చేరుకుంటారు.
  • టికెట్ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 57815గా ఉంది. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 57815గా నిర్ణయించారు.
  • ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
  • 8287932318, 9281495847, 8287932227 సందేహాల నివృత్థి కోసం ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.

మరోవైపు TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో హైదరాబాద్ నుంచి కూడా థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు. ఈ టూర్ ప్యాకేజీ మాత్రం… మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే… మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు తగ్గట్టుగా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ – థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ(Thailand Tour Package)ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 57415గా ఉంది. డబుల్ షేరింగ్ కు 49040గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49040గా ప్రకటించారు.www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

Exit mobile version