Home లైఫ్ స్టైల్ బ్యాడ్ లక్ పోవాలంటే ఇంట్లోని ఈ ప్రదేశాలను క్లీన్ చేయండి-cleaning these areas of your...

బ్యాడ్ లక్ పోవాలంటే ఇంట్లోని ఈ ప్రదేశాలను క్లీన్ చేయండి-cleaning these areas of your house to avoid bad luck in your life ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇంటిని శుభ్రం చేసుకోకుంటే అనేక సమస్యలు వస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. చిందరవందరగా ఉంటే దురదృష్టానికి దారి తీస్తుంది. ఇల్లు మొత్తం చక్కగా, నీట్‌గా ఉంచుకోవడం మంచి అలవాటు మాత్రమే కాకుండా మానసికంగా, శారీరకంగా చురుకుదనం, సానుకూల శక్తిని ఇస్తుంది. ఎప్పుడూ ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరని వారు కనీసం ఇంట్లో ఈ ఆరు ప్రదేశాలను సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే దురదృష్టం దూరమవుతుంది. మానసిక, శారీరకంగా బాగుంటారు. అవి ఏంటో చూద్దాం..

ఇంటి ద్వారం

ప్రవేశ మార్గమే ఇంటిపై మొదటి అభిప్రాయం. మంచి ఆలోచనలు, భావాలు రావాలి అంటే ఇదే ముఖ్యం. ప్రవేశ ద్వారం చిందరవందరగా ఉంటే, అదృష్టం రాదు. బూట్లు, కోట్లు, బ్యాగులు వేసి ఈ స్థలాన్ని అస్తవ్యస్తం చేయవద్దు. డోర్, ఫ్లోర్, మ్యాట్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. కాలింగ్ బెల్, డోర్క్‌నాబ్ సరిగ్గా పని చేస్తున్నాయని నిర్ధారించుకోండి. ఈ ప్రవేశ మార్గాన్ని మొక్కలు, పూలతో నింపడం ద్వారా ఎల్లప్పుడూ స్వాగతించే అనుభూతిని అందించండి.

బాత్రూమ్

బాత్రూమ్ అనేది నీటితో సంబంధం ఉన్న ప్రదేశం. నీరు సంపదను సూచిస్తుంది. కానీ ఈ స్థలం చిందరవందరగా ఉంటే, అది ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. బాత్‌రూమ్‌లో మురికి బట్టలు వేస్తే ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఏదైనా లీకేజీ పైపులు, మరేదైనా ఉంటే పరిష్కరించండి. మీ వస్తువులన్నింటినీ చక్కగా, క్రమబద్ధంగా ఉంచండి. మొక్కలు, కొవ్వొత్తులు, స్ఫటికాలు మొదలైన వాటితో అలంకరించడం ద్వారా ఈ స్థలాన్ని స్వచ్ఛంగా ఉంచడం కూడా మంచిది.

పడకగది

పడకగది ఆనందం, ప్రేమకు ముఖ్యమైనది. ఈ ప్రాంతం చిందరవందరగా ఉంటే అది నిద్ర, మానసిక స్థితి, సంబంధాలకు హాని కలిగించవచ్చు. పని వస్తువులు, సాధనాలతో సహా అన్ని అనవసరమైన వస్తువులను పడకగది నుండి తీసివేయండి. మంచం కింద అనవసరమైన వస్తువులను కూడా తొలగించండి. చిందరవందరగా ఉన్న ప్రదేశం ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది. కంటికి ఆహ్లాదకరమైన రంగులతో బెడ్‌ రూమ్‌ను డెకరేషన్ చేయండి. ప్రకాశవంతమైన లైట్లను ఉపయోగించడం మానుకోండి. గదిని సువాసనతో నింపే పువ్వులు, పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించండి.

వంటగది

వంటగది అనేది ఇంటికి హృదయంవంటిది. కిచెన్ అనేది ఆహారాన్ని వండడానికి మాత్రమే కాదు, ప్రియమైన వారితో మంచి క్షణాలను పంచుకోవడానికి కూడా ఒక ప్రదేశం. వంటగది మురికిగా ఉంటే జీర్ణ సమస్యలు, ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. వంటగదిని శుభ్రం చేయడానికి, అక్కడ నుండి పాడైపోయిన పాత్రలు, పాత ఆహారాన్ని తొలగించండి. స్టవ్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. వంటగది అనేది అగ్ని, నీరు, భూమికి సంబంధించిన స్థలం. వంటగదిలో తాజా పండ్లు, పువ్వులు ఉంచడం వల్ల సానుకూల శక్తి, శ్రేయస్సు లభిస్తుంది.

లివింగ్ రూమ్

కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకోవడానికి, మంచి క్షణాలను పంచుకునే గది లివింగ్ రూమ్. ఇది ఇంట్లో అత్యంత అందమైన ప్రదేశం. లివింగ్ రూమ్ చిందరవందరగా ఉంటే ఇంట్లో వాతావరణం అశుభకరంగా మారుతుంది. పాత వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, బొమ్మలు, ఇతర అనవసరమైన వస్తువులను ఇక్కడ నుండి తీసివేయండి. మీరు గదిలోకి హాయిగా నడవగలిగే విధంగా ఇక్కడ ఫర్నిచర్‌ను అమర్చండి. ఆర్ట్ సామాగ్రి, ఛాయాచిత్రాలతో అలంకరించండి. గదిలో మంచి రంగులను ఎంచుకోండి.

ప్రత్యేక గది

చాలా ఇళ్లలో పని చేయడానికి, చదువుకోవడానికి, కళాత్మక పనులు చేయడానికి ప్రత్యేక గది ఉంటుంది. ఇది ఆలోచించడానికి అనువైన ప్రదేశం. అయితే ఈ ప్రాంతం చిందరవందరగా మారితే అది ఏకాగ్రత, ప్రేరణను నాశనం చేస్తుంది. అన్ని అనవసరమైన పేపర్లు, ఎన్వలప్‌లను తీసివేసి, డెస్క్‌లు, షెల్ఫ్‌లను చక్కగా ఉంచండి. మీరు క్రమం తప్పకుండా ఉపయోగించాల్సిన వస్తువులను మాత్రమే ఉంచండి. ఇక్కడ మొక్కలు, పొదలను ఉంచడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Exit mobile version