Krishna mukunda murari serial april 23rd episode: కృష్ణకి నిజం చెప్తే ఎంత కుమిలిపోతుందో ఏమోనని మురారి బాధపడతాడు. భవానీ వచ్చి దిగులుగా కూర్చున్న కృష్ణ వాళ్ళని పలకరిస్తుంది. ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు. మా దగ్గర ఏం దాయడం లేదు కదా ప్రాబ్లం ఏమైనా ఉందా అని రేవతి అడుగుతుంది.
కడుపే రాకుండా పోయింది
ప్రాబ్లం ఏమని లేదని మురారి చెప్తాడు. కానీ మీరు అలా లేరు నెలలు నిండి జరగరానిది జరిగి కడుపు పోయినట్టు ఉన్నారని రజిని నోటికి పని చెప్తుంది. భవానీ తనని తిడుతుంది. నోటి దూలతో చెప్పిన నిజం చెప్పింది. అయితే వచ్చిన కడుపు పోవడం కాదు అసలు కడుపే రాకుండా పోయిందని ముకుంద మనసులో సంతోషిస్తుంది.
మీరు ఇలాగే డల్ గా ఉంటే ఎలా పడితే అలా మాట్లాడతారని రేవతి సర్ది చెప్తుంది. మురారి తన బాధని మనసులోనే దాచుకుని పైకి మాత్రం కృష్ణకి ధైర్యం చెప్తాడు. చాలా భయం వేసింది పెద్దత్తయ్య. అసలు బతుకుతానో లేదో బతికినా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానో లేదో అని ఏవేవో ఆలోచనలు. ఇంకా ఆ భయం వెంటాడుతుందని కృష్ణ బాధపడుతుంది.
ఆదర్శ్ పెళ్లి గోల
నీ మైండ్ లో నుంచి అవి తీసేసి నువ్వు పెద్ద పెద్దమ్మకి ఇచ్చిన మాట కూడా ఫిక్స్ అయినట్టే ప్రపంచం తల్లకిందులైన నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావని మధు కూడా ధైర్యం చెప్తాడు. ఏంటి నిలబెట్టేది వారం రోజుల్లో గర్భసంచి తీసేస్తున్నారని ముకుంద అనుకుంటుంది.
భవానీ కృష్ణని చాలా ప్రేమగా చూసుకుంటుంది. రేవతి ఏదో ఆలోచిస్తూ ఉంటే మధు వచ్చి కృష్ణ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. కృష్ణకి కడుపు నొప్పి అనగానే అందరూ ఏదేదో ఊహించుకుని భయపడుతున్నారు. కానీ సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంట్లోకి మనవడు, మనవరాలు వస్తారు వాళ్ళ ఫోటోలు నేనే తీస్తానని అంటాడు.
నేను ఆలోచిస్తుంది కృష్ణ గురించి కాదు ఆదర్శ్ గురించి అంటుంది. అటుగా వెళ్తున్న ముకుంద వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది. కృష్ణకి బాగోకపోతే వాడు వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతున్నాడని అనేసరికి ముకుంద షాక్ అవుతుంది. మీరాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడని రేవతి మధుకి చెప్తుంది.
ముకుంద షాక్
కృష్ణ విషయంలో మారాడు కానీ ఆదర్శ్ మళ్ళీ నా వెంట ఎందుకు పడుతున్నాడు. అసలు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటి? నేను రూపాన్ని మార్చుకుని ఇన్ని పాట్లు పడుతుంది ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవడానికా? ఎలాగైనా ఆదర్శ్ ని డైవర్ట్ చేయాలి ఈలోపు నేను చేయాల్సింది నేను చేయాలని అనుకుంటుంది.
ఆదర్శ్ మీద కృష్ణ కోపం చూపించినా నష్టం ఏమి లేదని చెప్పి మధు ధైర్యం చెప్తాడు. మురారి పరిమళ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏ ఆడదానికి రాకూడని కష్టం నీకు వచ్చింది. నీకు విషయం చెప్తే ఏమవుతుందోనని భయంగా ఉందని మురారి కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
కృష్ణ ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదని చెప్పి కవర్ చేసేందుకు చూస్తాడు కానీ ఎందుకు అంతగా బాధపడుతున్నారని అంటుంది. నాకేమైన అయ్యిందా అంటుంది. పొద్దున కడుపు నొప్పి వచ్చినప్పుడు బాధ తట్టుకోలేకపోయావ్ కదా అది చూసి ఏడుపు వచ్చిందని చెప్తాడు.
నాకు ఏదైనా జరిగితే
పిచ్చి ఏసీపీ సర్ నాకేమైన అవుతుందని భయపడిపోయారా? చిన్న కడుపు నొప్పికె భయపడితే రేపు నాకు ఏదైనా జరగకూడనిది జరిగితే అని అంటుంటే మురారి ఆపేస్తాడు. బాధకలిగించే విషయాలు గుర్తు తెచ్చుకోకూడదు సంతోషంగా ఉండే విషయాలు గుర్తు తెచ్చుకోవాలి.
నాకు ఎప్పుడెప్పుడు పెద్దత్తయ్య చేతిలో బిడ్డ పెడతానని ఉంది. కానీ ముందు నేను నెలతప్పాలి. అంత ఎదురుచూడలేను కుంతీ దేవికి ఉన్నట్టు ఏవైనా మంత్రాలు ఉంటే బాగుండు తల్లిని అయిపోతానని అంటుంది. కృష్ణని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఎలాగైనా నిజం చెప్పాలని మురారి అనుకుంటాడు.
ముకుంద ఆనందం
ముకుంద సంతోషంగా డాక్టర్ వైదేహికి ఫోన్ చేస్తుంది. థాంక్స్ వైదేహి నీ వల్ల ఈరోజు నా శత్రువుల కళ్ళలో దుఖం చూశానని చెప్తుంది. ట్యాబ్లెట్ ఇచ్చేశాను కదపు నొప్పి రావడం గర్భ సంచి తీసేయాలి పిల్లలు కనలేదని చెప్పిందని అన్ని సంతోషం కలిగించే వార్తలు విన్నానని అంటుంది.
కృష్ణకి ఇంకా విషయం తెలియదు. అయినా తను డాక్టర్ కదా తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుడే దిగివచ్చినా కృష్ణకి పిల్లల్ని కనలేదు జీవితాంతం గొడ్రాలిగా బతకాల్సిందే దానికన్నా ప్రయాణం పోవడం బెటర్ కదా అని మాట్లాడుతూ ఉండగా ఆదర్శ్ వస్తాడు. తనని చూసి ముకుంద టెన్షన్ పడుతుంది.
ఆదర్శ్ పొగడ్తలు
ఆదర్శ్ విన్నాడేమోనని భయపడుతుంది. తన ఫ్రెండ్ కి బాగోలేదని ఏదో అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. ఆదర్శ్ మళ్ళీ ముకుందని పొగడటం మొదలుపెడతాడు. తన మాటలు వినలేదని ముకుంద రిలీఫ్ గా ఫీలవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలని చెప్తాడు.
తనకి ఏ సమస్యలు లేవని తనవన్నీ తీరిపోయాయని సంతోషంగా చెప్తుంది. నువ్వు తలుచుకుంటే ఇష్టాన్ని కష్టాన్ని తీరుస్తావ్.. అంతా నీ చేతుల్లోనే ఉందని ఆదర్శ్ సిగ్గుపడుతూ చెప్తాడు. ఈయన గీత దాటక ముందే గమ్యం చేరుకోవాలని ముకుంద అనుకుంటుంది.
రేవతి భవానీ దగ్గరకు వచ్చి ఆదర్శ్ గురించి మళ్ళీ మాట్లాడుతుంది. పిచ్చా నీకు అవతల కృష్ణకు బాగోలేదని టెన్షన్ పడుతుంటే నువ్వు వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అని భవానీ తిడుతుంది. నాకు కాదు వాడికి మతి లేదు కృష్ణని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే వాడు వచ్చి దీని గురించి అడిగాడని చెప్తుంది.