Home క్రికెట్ DC vs SRH: హైదరాబాద్ మరో గ్రాండ్ విక్టరీ.. రికార్డుల మోతతో ఢిల్లీని చిత్తుచేసిన సన్‍రైజర్స్.....

DC vs SRH: హైదరాబాద్ మరో గ్రాండ్ విక్టరీ.. రికార్డుల మోతతో ఢిల్లీని చిత్తుచేసిన సన్‍రైజర్స్.. వరుసగా నాలుగో గెలుపు

0

ఫ్రేజర్ మెరిపించినా..

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్థాయిలో ఆడలేకపోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), పృథ్వి షా (16) రాణించలేకపోయారు. అయితే, ఢిల్లీ బ్యాటర్, ఆస్ట్రేలియా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. అద్భుతమైన అర్ధ శకతంతో మెప్పించాడు. కాసేపు హైదరాబాద్ శిబిరంలో టెన్షన్ రేపాడు. అయితే, అతడిని ఏడో ఓవర్లో హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఔట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (22 బంతుల్లో 42 పరుగులు), రిషబ్ పంత్ (35 బంతుల్లో 44 పరుగులు) రాణించినా.. ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్ నటరాజన్ వరుస వికెట్లతో మెప్పించాడు. దీంతో 19.1 ఓవర్లలోనే 199 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌటైంది.

Exit mobile version