లోపలికి రాలేదు. ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి లోపలికి రాలేదు. ఆత్మ రాలేదని అభయమిచ్చాను కదా ఇంకా ఎందుకు నీ మనసులో సందేహ పడుతున్నావు అని మనోహరిని అంటాడు ఘోరా. పెళ్లి పీటల మీదకి వచ్చేవరకు గెలుపు నాదేనని చాలా ధీమాగా ఉన్నాను. కానీ, కల్యాణ ఘడియలు దగ్గర పడే కొద్దీ నా మనసులో ఏదో భయం, ఆందోళన ఉన్నాయి ఘోరా.. గంట ముందు వరకు అంతా కరెక్ట్‌గానే ఉందనిపించినా మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తోంది అంటుంది మనోహరి.