Home బిజినెస్ Dividend income: వయస్సు 5 నెలలు.. ఇన్ఫోసిస్ డివిడెండ్ ఆదాయం రూ.4 కోట్లు.. ఎవరికో తెలుసా?

Dividend income: వయస్సు 5 నెలలు.. ఇన్ఫోసిస్ డివిడెండ్ ఆదాయం రూ.4 కోట్లు.. ఎవరికో తెలుసా?

0

ఏకాగ్రహ్ రోహన్ మూర్తి గురించి మరిన్ని వివరాలు..

ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ ఆర్ నారాయణమూర్తి (Narayana Murthy) కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ కుమారుడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి. గత ఏడాది నవంబర్ 10న బెంగళూరులో జన్మించాడు. రోహన్ మూర్తి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ చేసి సోరోకో అనే సాఫ్ట్ వేర్ సంస్థను నడుపుతున్నారు. మూర్తి మీడియాను అపర్ణ కృష్ణన్ నిర్వహిస్తున్నారు. నారాయణమూర్తి, సుధా మూర్తి దంపతులకు మూడో మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి. నారాయణ మూర్తి, సుధా మూర్తి (Sudha Murthy) ల కుమార్తె అక్షత మూర్తి, యూకే ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు కృష్ణ, అనౌష్క. డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ లో అక్షత మూర్తికి 1.05 శాతం, సుధామూర్తికి 0.93 శాతం, రోహన్ మూర్తికి 1.64 శాతం వాటా ఉంది.

Exit mobile version