కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్ అధికారి భర్తకు గత ఏడాది ఫారెస్ట్ సర్వీస్‌లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారని, మరో అధికారిపై కర్ణాటకలో కుల ధృవీకరణ వివాదం నడుస్తోందని, మరో అధికారి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం ఆరోపించింది. ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అమోద ముద్ర పడితే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పాలిట మరణశాసనం అవుతుందని ఆరోపించారు.