Home లైఫ్ స్టైల్ పంచదార తినడం అంత ప్రమాదకరమా? రోజుకు ఒక మనిషి ఎంత చక్కెరను తినవచ్చు?-is eating sugar...

పంచదార తినడం అంత ప్రమాదకరమా? రోజుకు ఒక మనిషి ఎంత చక్కెరను తినవచ్చు?-is eating sugar all that dangerous how much sugar can a man eat per day ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

చక్కెరతో చేసిన ఆహారాలు తినడం వల్ల నోటి ఆరోగ్యం పాడవుతుంది. దంతాలు కూడా త్వరగా క్షీణిస్తాయి. అలాగే అధిక రక్తపోటు, ట్రై గ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయి. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పంచదార కలిపిన పానీయాలు, పదార్థాలు రుచిగా ఉన్నా కూడా అవి శరీరానికి చేసే నష్టం ఎంతో. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. అలాంటి ఆహారాన్ని తినాల్సిన అవసరం లేదు. చక్కెరకు బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తింటే మంచిది. పంచదారను తినడం మానేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పంచదార తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారు చక్కెరను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో చిరాకు, కోపం వంటివి ఎక్కువగా వస్తాయి. మూడ్ స్వింగ్స్ కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. చర్మం కూడా పేలవంగా మారి పొడిగా అవుతుంది. ఏజింగ్ లక్షణాలు త్వరగా వస్తాయి. చర్మంపై ముడతలు గీతలు వంటివి పడే అవకాశం ఉంది.

Exit mobile version