Home బిజినెస్ EPFO Wage Ceiling hike: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెరగనుందా? కేంద్రం ఏమంటోంది?

EPFO Wage Ceiling hike: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెరగనుందా? కేంద్రం ఏమంటోంది?

0

లాంగ్ పెండింగ్ ప్రపోజల్

ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచాలన్న డిమాండ్ ఉద్యోగుల నుంచి చాలా సంవత్సరాలుగా వస్తోంది. దాంతో, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. గతంలో చివరగా, ఈపీఎఫ్ఓ వేతన పరిమితి (EPFO Wage Ceiling) ని 2014 లో పెంచారు. అప్పుడు, పీఎఫ్ వేతన పరిమితిని రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో, మరోసారి ఈ పరిమితిని పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఈ డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు వస్తారు. దానివల్ల, ప్రభుత్వం పై మరింత ఆర్థిక భారం పడుతుంది. అందువల్ల, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తోందని తెలుస్తోంది.

Exit mobile version