Home క్రికెట్ Suryakumar Mumbai Indians : సూర్యకుమార్​ యాదవ్​ ఫిట్​.. ముంబై ఇండియన్స్​ కష్టాలు తీరినట్టేనా?

Suryakumar Mumbai Indians : సూర్యకుమార్​ యాదవ్​ ఫిట్​.. ముంబై ఇండియన్స్​ కష్టాలు తీరినట్టేనా?

0

సూర్య రాకతో ఎంఐ పరిస్థితి మారుతుందా..?

ఐపీఎల్​ 2024లో ముంబై ఇండియన్స్​ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచ్​లలో ఓటమి పాలైంది. వాస్తవానికి ఎంఐకి ఇది కొత్తేమి కాదు. గతంలో సీజన్​ని దారుణంగా మొదలుపెట్టి, చివరికి.. టైటిల్​ని ఎగరేసుకుపోయిన సందర్భం ఉంది. కానీ అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా ఎక్కడికి వెళ్లినా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్​ శర్మ జట్టుపై, జట్టు యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నట్టు, వచ్చే ఐపీఎల్​కి ముంబైని వదిలేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి మధ్య.. జట్టు ప్రదర్శన దెబ్బతింటోంది.

Exit mobile version