గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ… పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.